![]() |
![]() |

అర్థమయ్యిందా అరుణ్ కుమార్ వెబ్ సిరీస్ తో అందరికీ బాగా దగ్గరయింది అనన్య శర్మ. ఈ సిరీస్ లో ఆమె నటనకు ఫుల్ మార్క్స్ పడ్డాయి. అలాంటి అనన్య శర్మ ఒక ఇంటర్వ్యూలో చాలా విషయాలు చెప్పుకొచ్చింది. తనకు సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండడం అస్సలు ఇష్టం లేదు అని చెప్పింది. ఎక్కువగా ప్రైవేట్ లైఫ్ గడపడం ఇష్టం అని అంది. తాను పెద్ద ఫోన్ పర్సన్ కాదు అని ఎక్కువగా ఎవరికీ రిప్లై ఇవ్వనని అందుకే తనను అంతా ఆటిట్యూడ్ పర్సన్ అని అందరూ అనుకుంటూ ఉంటారట.
అలాగే మొదట్లో తాను ఇండస్ట్రీలోకి రావడాన్ని ఎవరూ ఇష్టపడలేదని చెప్పింది. ఐతే తన పెళ్లి విషయం వచ్చేసరికి మంచి మనసున్న, నిజాయితీ ఉన్న అబ్బాయి వస్తే చేసుకుంటాను అని ఒక వేళా అతనికి జాబ్ లేకపోయినా కూడా పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది. జీవితంలో ప్రేమ ఉండాలి తర్వాత ఆటోమేటిక్ గా డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్పింది అనన్య. ఇంజనీరింగ్ చేసిన అనన్య ఒక వేళా మూవీ అవకాశాలు లేనప్పుడు అప్లికేషన్ పెట్టుకుని జాబ్ చేసుకోవడానికైనా వెళ్ళిపోతా అని చెప్పింది. ‘30 వెడ్స్ 21’ వెబ్‌సిరీస్‌లో హీరోయిన్ గా నటించిన అనన్య మంచి మంచి మూవీ ఛాన్సెస్ నటనకు స్కోప్ ఉన్న పాత్రలను ఎంచుకుంటూ వెళ్తోంది. బాయిస్ ఫార్ములా అనే యూట్యుబ్ చానెల్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమయ్యింది. "బ్రదర్ అండ్ సిస్టర్ టేల్స్" అనే షార్ట్ ఫిల్మ్‌తో తన కెరీర్ ని స్టార్ట్ చేసింది. ఇక లక్కీ భాస్కర్ మూవీలో నటించి మంచి పేరు తెచ్చుకుంది.
![]() |
![]() |